వార్షికోత్స‌వం అన‌గానే ఏ ఛానెల్ అయినా.. స్క్రీన్ లుక్‌ని మార్చేసుకోవ‌డం స‌హ‌జం. మొన్నే 11వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ABN ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌ రూపు రేఖ‌లు కూడా బాగా మారిపోయాయి. మార్పు మంచి విష‌య‌మే కానీ.. అదేంటో ABN ఆంధ్ర‌జ్యోతి  యాజ‌మాన్యానికి మ‌రో స్టైలే దొర‌కలే‌ద‌న్న‌ట్టు అచ్చు టీవీ 9 లుక్‌ని ఉన్న‌దున్న‌ట్టుగా దింపేసింది.


ABN ఆంధ్ర‌జ్యోతి, టీవీ 9ని స్క్రీన్‌ల‌ని ప‌క్క ప‌క్క‌న‌ చూసిన‌ప్పుడు రెండు ఛానెళ్లూ ఒకేలా క‌నిపిస్తున్నాయి. ABN ఆంధ్ర‌జ్యోతి స్క్రీన్  క్వాలిటీ కొంచెం త‌క్కువ కావ‌డం,  రెండు ఛానెళ్ల లోగోలు వేర్వేరు కాబ‌ట్టి కొంచెం తేడాగా ఉన్నాయే త‌ప్ప‌..  మిగ‌తా అంతా ఒకేలా క‌నిపిస్తున్నాయి.  పైన టాప్, కింద స్క్రోలింగ్ డిజైన్ జ‌స్ట్ అలా కాపీ చేసింది ABN ఆంధ్ర‌జ్యోతి.

మ‌రో విశేషం ఏమిటంటే.. చాలా సార్లు టీవీ 9 ఏ ఇష్యూపై ఫోక‌స్ చేస్తుందో.. ABN ఆంధ్ర‌జ్యోతి  కూడా దాన్నే ఫాలో అవుతోంది. ఫైన‌ల్లీ.. అంత‌లా కాపీ కొడుతున్నా రేటింగుల్లో మాత్రం టీవీ 9 టాప్‌లో ఉంటే ABN ఆంధ్ర‌జ్యోతి  లిస్ట్‌లో ఎక్క‌డో కిందే ఉండిపోవ‌డం కొస‌మెరుపు.